1౯౯౫:
అనగనగా ఒక పండుగ . ఆ రోజు కృష్ణుడు సత్యభామ తో కలిసి నరకాసురుడిని వధించారు అందుకని అంతా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. అందుకని ఆ పండుగని దీపావళి అంటారు.
తెలుగు లో దీపం అనే పదం ఉంది. ఆవళి అనే పదం ఉంది. అందుకే దీపావళి అనే పదం పుట్టింది.
రెండేళ్ళ తర్వాత :
దీవాళీ అనే పండుగ ఉత్తర భారతదేశం లో ఎక్కువగా జరుపుకుంటారు. రాఖి పండుగ వలెనే ఈ పండుగ కూడా ఉత్తరాది నుండి దక్షిణాది కి వచ్చింది. ఆ రోజు అంధ్రప్రదేశ్ లో కూడా దీవాళీ ని భక్తి శ్రద్దల తో జరుపుకుంటారు.
రాష్ట్రమంతా "దీవాళీ ధమాకా " లు రాజ్యమేలుతాయి.
-------------------------------------------------------------------------------------------------
మనం వాడే పదాలని బట్టే ఒక భాష మనుగడ ఆధార పడి ఉంటుంది అని నమ్మే వాళ్ళకి నేను ఏంచెప్పబోతున్నానో అర్ధం అయ్యే ఉంటుంది. "ఆ! దీపావళి ని దీవాళీ అన్నంత మాత్రాన కొంపలు ముంచుకుపోతాయా అనే వాళ్ళకి , ఈ బ్లాగ్ కి సంబంధం లేదు. వాళ్లు హాయిగా వేరే బ్లాగ్లు చదువుకోవచ్చు. కాకపోతే అంటే ఏమొచ్చింది అనేవాళ్ళు అనాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని ఆలోచించుకుంటే చాలు.
-------------------------------------------------------------------------------------------------
"Happy DIWALI"
"DIWALI Wishes for you and your family"
"Let this DIWALI bring light to your life,many wishes" ....
ఇది వరస,
పండుగలని కూడా పర భాష లోనే ......
ఇప్పుడు నాకు తెలిసిన పిల్లలంతా దీవాళీ అనే అంటున్నారు. ఈ సంవత్సరం దీపావళి అనే మాట అసలు విన్నట్టు గుర్తే లేదు.
దీపావళి అనే మాట మన మన రాతలో గాని, మాటలో గాని మిగలనప్పుడు మన హృదయాలలో , మన తర్వాతి తరాల హృదయాలలో ఎలా మిగులుతుంది. జీ తెలుగు లో దీపావళి ప్రత్యేక ప్రసారాల కోసం వేసే ప్రకటనలో "దీవాళీ ధమాకా"
అని ఉంటుంది చూడండి కావాలంటే . మనకు మనమే గొయ్యి తీసి తెలుగు ని పరభాషామట్టి తో పూడ్చి వేస్తున్నంత కాలం తెలుగు ఇలాగే ఉంటుంది.
తెలుగుని వాడుతున్నంత కాలమే తెలుగు బతికి ఉంటుంది. ఇది నిజం.
Showing posts with label దీపావళి. Show all posts
Showing posts with label దీపావళి. Show all posts
Friday, October 24, 2008
Subscribe to:
Posts (Atom)


